Skip to main content

ప్రసూతి ప్రయోజన చట్టం -1961 (MATERNITY BENEFIT ACT)

ప్రసూతి ప్రయోజన చట్టం -1961 (MATERNITY BENEFIT ACT)

·         మహిళలకు కాన్పు సమయంలో  విధులకు సంబంధించి కాన్పుకు ముందు మరియు తర్వాత   ప్రత్యేక ప్రయోజనాలను కల్పించేందుకు 1 961 లో ప్రయోజనాల చట్టాన్ని రూపొందించడం జరిగింది  దీనిని మాతృత్వ సంక్షేమ చట్టం అని కూడా అంటారు
·         దేశమంతటా అన్ని ఫ్యాక్టరీలకు ఈ చట్టం వర్తిస్తుంది
·         పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఫ్యాక్టరీలు అన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది
·         కొన్ని రాష్ట్రాలు ప్రసూతి ప్రయోజన చట్టం వెసులుబాటు తో పాటు ఉచిత చికిత్స ప్రసూతి బోనస్ బాలల లాలన కేంద్రాలు లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు
·         స్థానిక భీమా చట్టం లాంటి నియమాలు వర్తించే సంస్థలకు ఈ చట్టం వర్తించదు
·         ఈ చట్టం ప్రకారం మహిళా అంటే సంస్థలో వేతనాలు తీసుకొని ఉద్యోగం చేసేందుకు యాజమాన్యం నేరుగా లేదా కాంట్రాక్టు ద్వారా నియమించబడిన మహిళా అని అర్థం
·         ప్రసూతి ప్రయోజనాల చట్టానికి అర్హత పొందాలంటే గడిచిన 12 నెలల లో కనీసం 80 రోజులు మహిళా సంస్థలో పని చేసి ఉండా లి
·         ఈ సెలవుల్లో లెక్కింపులో  హాలిడే లాంటి వేతనంతో కూడిన సెలవు కూడా పని దినాలు గా పరిగణించాలి
·         అస్సాంలో  ఏమిగ్రేట్ అయిన మహిళకు  80  రోజులు పని చేయాలనే నిబంధన వర్తించదు
·         1961 ప్రయోజనాల చట్టం ప్రకారం ప్రసూతి తర్వాత ఆరు వారాల వరకు  యజమాని ఏ విధమైన పనులను గర్భిణీ స్త్రీ కి చెప్పరాదు అలాగే గర్భిణీ స్త్రీ కూడా  ప్రసవ సమయం తర్వాత ఆరు వారాలలో ఏ ఇతర సంస్థలో కూడా పని చేయకూడదు
·         యజమాని ప్రసూతి సమయంలో ఉద్యోగిని తొలగించడం గాని, , డి ఛార్జ్, డిస్మిస్ చేయడం వంటివి కానీ చేయకూడదు
·         ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు రోజువారి కార్మికులకు కూడా ప్రయోజనాలు కల్పించాలని తీర్పు చెప్పడం జరిగింది
·         1989 సవరణకు ముందు  మహిళ ఉద్యోగికి ప్రసవం తర్వాత 6 వారాలు మాత్రమే సెలవ ఉండేది ప్రసూతికి ముందు సెలవు ఉండక పోయేది
·         1989 సాధారణ తర్వాత గర్భిణి అయిన ఉద్యోగి ప్రసూతికి ముందు ఆరు వారా లు ,తర్వాత ఆరు వారాల వరకు,మొత్తం మీద 12 వారాలు సెలవు తీసుకొని వచ్చు  వారం అంటే ఇక్కడ ఆదివారం తో సహా ఏడు రోజులు
·         ఈ ప్రయోజనం అనేది మహిళకు ఎంతమంది పిల్లలు ఉన్న కూడా వర్తిస్తుంది
·         ప్రయోజనాల కాలంలో ప్రతి రోజు కు సగటు దినసరి జీతం రేటు   జీతం చెల్లించాల్సి ఉంటుంది
·         ప్రసూతి కాలంలో ఆమె మరణిస్తే, పాపను ప్రసవించకుండానే  తుదిశ్వాస విడిచిన తేదీతో కలుపుకొని లేదా మరణిస్తే మొత్తం కాలానికి డబ్బులు చెల్లిస్తార ఇది గరిష్టంగా 12 వారాల వరకు డబ్బు చెల్లించడం జరుగును 
·         ప్రసూతి ప్రయోజనం పొందడం కోసం కార్మికురాలు నిర్ణీత ఫారం లో నోటీసు యజమానికి అందించాల్సి ఉంటుంది ఇందులో తనకు సంబంధించిన నామిని పేరును రాయాల్సి ఉంటుంది
·         ఈ నోటీసు నందు ప్రసూతి సమయం తర్వాత ఆరు వారాల వరకు తను ఇతర సంస్థలో పని చేయనని హామీ ఇవ్వవలసి ఉంటుంది
·         ఒకవేళ నోటీసు ఇవ్వనంత మాత్రాన మహిళకు ప్రసూతి ప్రయాణాలు తిరస్కరించడానికి వీలులేదు
·         గర్భం దాల్చిన విషయాన్ని స్త్రీ ఆధార సైతం గా ఋజువు చేసి ప్రసవ సమయంలో ,ముందుగా 48 గంటల్లో ప్రసూతి డబ్బులు తీసుకొ న వచ్చ
·         కొన్ని సందర్భాలలో గర్భస్రావం ఏర్పడితే ఆ విషయాన్ని నిర్ణీత రుజువు ద్వారా తెలియపరచి ఆరు వారాల వరకు వేతనంతో కూడిన సెలవు లు పొందవచ్చు
·         మహిళ  ట్యూబెక్టమీ చికిత్స జరుపుకుంటే ,చికిత్స రోజు నుంచి రెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వవలసి ఉంటుంది
·         ఒకవేళ మహిళకు ప్రసవ సమయంలో లేదా గర్భం సమయంలో ట్యూబెక్టమీ వల్ల అనారోగ్యం కలిగితే గరిష్టంగా నెల రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది
·         ప్రసవానికి ముందు, తర్వాత కనీస సౌకర్యాలు కల్పించని సందర్భంగా ,ప్రసూతి సమయంలో 250 రూపాయల మెడికల్ బోనస్ ఈ చట్టం ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది
·         యజమాని ప్రసూతి ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది మరియు ప్రసూతి సెలవు అదనపు విరామ సమయాల్లో కూడా కల్పించాల్సిన బాధ్యత యజమాని ఫై ఉంటుంది ,  నిర్ణీత రిజిస్టర్ లో రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది
·         యజమాని, ఇన్స్పెక్టర్ ఉత్తరువుల  మీద 30 రోజుల్లో ఉన్నత అధికారికి అప్పీలు చేసుకోవచ్చు
·         ఈ చట్టం ప్రకారం చట్టం అమలు విషయాన్ని పరిశీలించేందుకు ఇన్స్పెక్టర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించుకోవచ్చు
·         యజమాని  ప్రసూతి ప్రయోజనం చెల్లించినట్లయితే ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చు
·         ఉద్యోగులు కూడా 60 రోజుల్లోగా యజమాని పై ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకోవచ్చు
·         2008 సంవత్సరంలో మరొక సవరణ ఫలితంగా మెడికల్ బోనస్  250 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది
·         మెడికల్ బోనస్ ను 20 వేల రూపాయలకు మించి పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు
·         ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ బోనస్ ని పెంచే అధికారాన్ని 2008 సంవత్సరంలో సెక్షన్ 8 సవరించడం ద్వారా కల్పించినారు
·         2017 మరో సవరణ ఫలితంగా 12 వారాల నుంచి 26 వారాల వరకు వేతనంతో కూడిన సెలవు లు గర్భిణీ స్త్రీకి కల్పించాల్సి ఉంటుంది
·         ఈ సవరణ 1 ఏప్రిల్ 2017 నుంచి అమలులోకి వచ్చింది దీని ప్రకారం మొదటి రెండు కాన్పులకు 26 వారాల సెలవు ఆ తర్వాత కాన్పుకి 12 వారాల సెలవు కల్పించినది
·         ఒకవేళ మూడు నెలల పాప ను దత్తత తీసుకున్న లేదా ఇచ్చిన 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి ఉంటుంది
·         ఈ సవరణ ప్రకారం 50 లేదా అంతకన్నా ఎక్కువమంది ఉన్న సంస్థను వారి పిల్లల లాలన కోసం రోజుకు నాలుగు సార్లు 15 నిమిషాల చొప్పున విరామం కల్పించాలి
·         ఈ సవరణ ప్రకారం ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఇంటి వద్ద కూడా  సంస్థకు సంబంధించిన  చిన్న చిన్న పనులు నిర్వర్తించవచ్చు అలాగని కచ్చితంగా చేయాలని నియమం అయితే ఏదీ లేదు
·         ముఖ్యమైన సెక్షన్లు;
·         సెక్షన్-3( ఓ): ప్రకారం ప్రసూతి ప్రయోజన చట్టం కింద మహిళా అని అర్థం తెలియజేయునది
·         సెక్షన్- 5 (2 ):ప్రకారం కాన్పుకు ముందు, 12  నెలల లో కనీసం 80 రోజులు పని చేసి ఉండాలి
·         సెక్షన్-5:  ప్రకారం సగటు దినసరి వేతనం రోజు చొప్పున ప్రసూతి కాలపు ప్రయోజనాలు కల్పించాలి
·         సెక్షన్ -6( 1) మరియు 6 (2 ): నోటీసు  ఇవ్వనంత మాత్రాన ప్రసూతి కాలపు ప్రయోజనాలు తిరస్కరించడానికి వీలులేదు
·         సెక్షన్ -6 (5) :ప్రకారం ప్రసవించిన సంగతిని రుజువు చేసిన తర్వాత 48 గంటల్లో మిగిలిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది
·         సెక్షన్- 7 :ప్రకారం ప్రసూతి కాలంలో మహిళ మృతి చెందితే ఆ డబ్బుని వారసులకు లేదా నామినీకి చెల్లించాల్సి ఉంటుంది
·         సెక్షన్ -9: ప్రకారం ప్రసూతి  ప్రయోజన కాలంలో ఇచ్చే రేటు ప్రకారం ,యజమాని వేతనం చెల్లించాల్సి ఉంటుంది
·         సెక్షన్ -9 (ఏ) :ప్రకారం ట్యూబెక్టమీ జరిగినట్టు నిర్ణీత ఫారం లో యజమానికి రుజువు చూపించాల్సి ఉంటుంది
·         సెక్షన్ -10 : ప్రకారం ట్యూబెక్టమీ మరియు ఇతర ప్రసవ సమయంలో కలిగే అనారోగ్యాలకు గరిష్టంగా నెల రోజుల వేతనం అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది
·         సెక్షన్ 8: ప్రకారం గర్భిణీకి మెడికల్ బోనస్సు కల్పించాల్సి ఉంటుంది
·         సెక్షన్ 11 :ప్రకారం కార్మికురాలు కి సాధారణంగా లభించే విరామాలతో పాటు అదనంగా పాపను లాలించడానికి పనివేళలో రెండు సార్లు 15 నిమిషాల చొప్పున విరామం కల్పించా లి
·         సెక్షన్ 18: ప్రకారం ప్రసూతి సెలవులు పొందిన మహిళ ఆ కాలంలో ఇతర సంస్థల్లో పని చేసినట్లు రుజువైతే యజమాని ప్రసూతి ప్రయోజనాలు ఇవ్వకుండా జప్తు చేయవచ్చు
·         సత్యం 17 (1);ప్రకారం యజమాని  ప్రసూతి ప్రయోజనాలు చెల్లించకపోతే ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు
·         సెక్షన్ 21 (2): ప్రకారం ప్రసూతి ప్రయోజనాలు చెల్లించకపోతే ఏడాది వరకు జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించబడును
·         సెక్షన్ 22: ప్రకారం ఇన్స్పెక్టర్ అడిగిన రికార్డులు ఇవ్వకపోతే ఏడాది వరకు జైలు మరియు ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించబడును

Comments

Popular posts from this blog

పారిశ్రామిక వివాదాల చట్టం -1947 (INDUSTRIAL DISPUTES ACT)

పారిశ్రామిక వివాదాల చట్టం -1947 (INDUSTRIAL DISPUTES ACT) ·          కార్మికులకు మరియు యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను లేదా విభేదాలను ముదరకుండా పరిష్కారం కోసం తయారుచేయబడిన చట్టమే    పారిశ్రామిక వివాదాల చట్టం ·          సమ్మెలు ,లాక్ అవుట్లు జరగకుండా కార్మికులు సంఘటితమై ,తమకు న్యాయంగా రావాల్సిన హక్కులను   కోరడానికి   అన్ని అవకాశాలను కల్పిస్తూనే ,శాంతిని కాపాడటానికి ఈ చట్టం అనేక నియమాలను రూపొందించింది ·          లే ఆఫ్ , రిట్రెంచ్మెంట్ ,మూసివేత జరిగినప్పుడు నష్టపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ చట్టంలో చెప్పడం జరిగింది ·          ఈ చట్టం కార్మిక సంస్థలలో అవసరమైన ఉద్రిక్తతను నిరోధించి వివాదాలను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని రూపొందించ0   జరిగినది ·          ఒక సంస్థలో ఉద్యోగస్తులైన   ప్రతి వ్యక్తికి ఈ చట్టం వర్తిస్తుంది ·          ఈ చట్టం ప్రకారం ఉద్యోగానికి ,ఉద్యోగ సాహిత్యానికి సంబంధించిన వివాదం కూడా పారిశ్రామిక వివాదం అవుతుంది ·          ఈ వివాదాలు యజమానికి కార్మికులకు, కార్మికులకు కార్మికుల మధ్య ఉండాలి ఈ వివాదం గురించి లేదా ఉద్యోగం లేకపోవడం గురించి ,ఉద్యో

గ్రాట్యూటీ చెల్లింపు చట్టం 1972

·        గ్రాట్యూటీ చెల్లింపు చట్టం 1972 ·          1972 కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగింది ·          సంస్థ కు సేవలందించి ఆర్థిక ప్రగతి కి కృషిచేసిన కార్మికునికి , యాజమాన్యం ఇచ్చే ప్రతిఫలమే గ్రాట్యూటీ ·          కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక వెసులుబాటును కల్పించడం కోసం   గ్రాట్యూటీ చెల్లింపు చట్టం తీసుకురావడం అయినది ·            పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఏడాదికి పైగా పనిచేస్తూ ఉన్నచోట , ఈ చట్టం కింద గ్రాట్యూటీ చెల్లించవలసి ఉంటుంది తర్వాత ఉద్యోగుల సంఖ్య పదికి తగ్గిన ఈ చట్టం వర్తిస్తుంది ·          1995 సంవత్సరాల నుంచి సిక్కిం రాష్ట్రానికి కూడా గ్రాట్యూటీ చెల్లింపు చట్టం వర్తింపజేస్తున్నారు ·            పూర్వాపరాలు; ·            మొదట్లో ఈ చట్టం కింద వెయ్యి రూపాయల జీతం తీసుకునే వారికి ఈ చట్టం వర్తించేది ·          1992 సవరణ ప్రకారం 3500 కంటే తక్కువ జీతం తీసుకునే వారికి ఈ చట్టం వర్తింపజేశారు మరియు గ్రాట్యూటీ సొమ్మును 60000 మించకుండా ఉండేవిధంగా నిర్ణయించార