Skip to main content

Posts

Showing posts from April, 2019

గ్రాట్యూటీ చెల్లింపు చట్టం 1972

     గ్రాట్యూటీ చెల్లింపు చట్టం 1972 ·          1972 కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగింది ·          సంస్థ కు సేవలందించి ఆర్థిక ప్రగతి కి కృషిచేసిన కార్మికునికి , యాజమాన్యం ఇచ్చే ప్రతిఫలమే గ్రాట్యూటీ ·          కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక వెసులుబాటును కల్పించడం కోసం   గ్రాట్యూటీ చెల్లింపు చట్టం తీసుకురావడం అయినది ·            పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఏడాదికి పైగా పనిచేస్తూ ఉన్నచోట , ఈ చట్టం కింద గ్రాట్యూటీ చెల్లించవలసి ఉంటుంది తర్వాత ఉద్యోగుల సంఖ్య పదికి తగ్గిన ఈ చట్టం వర్తిస్తుంది ·          1995 సంవత్సరాల నుంచి సిక్కిం రాష్ట్రానికి కూడా గ్రాట్యూటీ చెల్లింపు చట్టం వర్తింపజేస్తున్నారు ·            పూర్వాపరాలు; ·            మొదట్లో ఈ చట్టం కింద వెయ్యి రూపాయల జీతం తీసుకునే వారికి ఈ చట్టం వర్తించేది ·          1992 సవరణ ప్రకారం 3500 కంటే తక్కువ జీతం తీసుకునే వారికి ఈ చట్టం వర్తింపజేశారు మరియు గ్రాట్యూటీ సొమ్మును 60000 మించకుండా ఉండేవిధంగా నిర్ణయించారు