Skip to main content

పారిశ్రామిక వివాదాల చట్టం -1947 (INDUSTRIAL DISPUTES ACT)


పారిశ్రామిక వివాదాల చట్టం -1947 (INDUSTRIAL DISPUTES ACT)

·         కార్మికులకు మరియు యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను లేదా విభేదాలను ముదరకుండా పరిష్కారం కోసం తయారుచేయబడిన చట్టమే   పారిశ్రామిక వివాదాల చట్టం
·         సమ్మెలు ,లాక్ అవుట్లు జరగకుండా కార్మికులు సంఘటితమై ,తమకు న్యాయంగా రావాల్సిన హక్కులను  కోరడానికి  అన్ని అవకాశాలను కల్పిస్తూనే ,శాంతిని కాపాడటానికి ఈ చట్టం అనేక నియమాలను రూపొందించింది
·         లే ఆఫ్ ,రిట్రెంచ్మెంట్ ,మూసివేత జరిగినప్పుడు నష్టపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ చట్టంలో చెప్పడం జరిగింది
·         ఈ చట్టం కార్మిక సంస్థలలో అవసరమైన ఉద్రిక్తతను నిరోధించి వివాదాలను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని రూపొందించ0  జరిగినది
·         ఒక సంస్థలో ఉద్యోగస్తులైన  ప్రతి వ్యక్తికి ఈ చట్టం వర్తిస్తుంది
·         ఈ చట్టం ప్రకారం ఉద్యోగానికి ,ఉద్యోగ సాహిత్యానికి సంబంధించిన వివాదం కూడా పారిశ్రామిక వివాదం అవుతుంది
·         ఈ వివాదాలు యజమానికి కార్మికులకు, కార్మికులకు కార్మికుల మధ్య ఉండాలి ఈ వివాదం గురించి లేదా ఉద్యోగం లేకపోవడం గురించి ,ఉద్యోగులకు సంబంధించి ,ఏ వ్యక్తులకు సంబంధించిన అంశం ఐన ఉండాలి
·         స్టాండింగ్ ఆర్డర్ ను అనువర్తించడం లేదా వర్తింప చేయడానికి సంబంధించిన వివాదాలు అయి ఉండాలి
·         కార్మికులను బర్తరఫ్ చేయడం ,తొలగించడం ,తిరిగి ఉద్యోగాలలో నియమించటం ,తప్పు నిర్ణయం ద్వారా తొలగించడం, సంబంధించినటువంటి వివాదాలు ,పనివేళలు, మధ్య విరామ సమయం ,నష్టపరిహారం, తదితర వేతనాల చెల్లింపు, చట్టబద్ధమైన కాదని ,చాలా కాలం నుంచి ఇస్తున్న సౌకర్యాలను హక్కులను తొలగించటం ,లాభాల్లో వాటా ,కార్మికులు ఉద్యోగం నుంచి ఆ కారణంగా తొలగించటం, ఉద్యోగిని నిర్బంధంగా పదవీ విరమణ చేయించడం, తొలగించిన ఉద్యోగిని మళ్లీ ఉద్యోగం లోకి తీసుకోవడం , లాక్ అవుట్ ,వ్యాపారం మూసివేత  సమంజసం సందేశంతో కూడిన దాని వల్ల నష్టపోయిన కార్మికుడికి ,యజమాని నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించినా అమలు చేయ చేయకపోవడం ,
·         ఒక ట్రేడ్ యూనియన్ కానీ , కొందరు కార్మికులు గాని,  సమిష్టిగా సమర్ధించే సమస్య, కార్మిక వివాదం లేదా పారిశ్రామిక వివాదాల ఇండస్ట్రీస్  కోర్టు కు ఇవ్వడం జరుగుతుంది
·         సమ్మె :ఒక పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల సంఘం సమిష్టిగా వ్యవహరిస్తూ లేదా సమిష్టిగా తిరస్కరిస్తూ తాత్కాలికంగా నిలిపివేయడం లేదా ఉద్యోగులలో కొందరు లేదా కొనసాగించడానికి అంగీకరించిన వారిలో కొందరు తాత్కాలికంగా పనిని నిలిపివేయడం , పాక్షికంగా పనిని నిలిపివేత ,పని నిలిపి నిరాహార దీక్ష చేయడం, సిట్టింగ్ ఇన్ ధర్నా చేయడం కూడా సమ్మె కిందికి వస్తాయి
·         రిట్రెంచ్మెంట్ (అదనపు సిబ్బంది తొలగింపు ):
·         క్రమశిక్షణ చర్య రూపంలో కాకుండా మరో కారణం చేత కార్మికులు యజమాని సర్వీసు నుంచి తొలగించడం
·         కార్మికుడు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ, రిట్రెంచ్మెంట్  కిందికి రాదు
·         రిట్రెంచ్మెంట్ కిందికి రానివి:
·         యజమాని కార్మికుడు మధ్య కుదిరిన ఒప్పందంలో నిర్దేశించిన షరతు ప్రకారం విరమణ వయసు వయసు రాగానే ఉద్యోగం నుంచి విరమింపజేయడం
·         సుదీర్ఘ అనారోగ్యం కారణంగా కార్మికుడికి ఉద్యోగ నుంచి తొలగించడం
·         యజమానికి కార్మికులకు మధ్య ఉద్యోగపు కాంట్రాక్టు ముగిసిపోవడం
·         లే ఆఫ్: (పని లేకుండా)
·         పారిశ్రామిక వివాదాల చట్టం యజమానికి లే ఆఫ్ చేసే అధికారం ఇస్తున్నది
·         కార్మికులు పని కి హాజరైన రెండు గంటల లోగా యజమాని పని ఇవ్వడానికి నిరాకరించిన పని ఇవ్వలేకపోవడం
·         బొగ్గు కొరత ,విద్యుత్ శక్తి కొరత, ఇంధనం ,ముడిసరుకు కొరత పేర్కొన్న నిలువలు, యంత్రాలు చెడిపోవడం ,ప్రకృతి వైపరీత్యం లేదా ఏ కారణంతోనైనా పని  కల్పించకపోవడం లో విఫలమైన ఆ కార్మికుడికి లే ఆఫ్ (పని లేకుండా) చేయడం అంటారు
·         లాకౌట్ :
·         లాకౌట్ మొత్తం వ్యాపారం నిలిచిపోతుంది
·         లే ఆఫ్ వ్యాపారం కొనసాగుతుంది, లాక్ అవుట్ లో యజమాని ఇతర కారణాల వల్ల కార్మికులు అందరికీ పని నిరాకరిస్తాడు
·         రాజీ ఒప్పందం : పరిష్కారం ఈ విధానంలో యజమానులు కార్మికులు సమస్యపై ఒక అంగీకారం రావడం
·         ఆ ఒప్పందంపై సంతకాలు చేసుకొని సెటిల్మెంట్ కావటం
·         రాజీ విధానం యజమానులు కార్మికుల సమస్యలపై రాజీ ప్రయత్నాలు చేసి రాజీకీ రావడం జరుగుతుంది దానికి యజమాని మరియు కార్మికులు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది
·         రాజి అధికారి:   యజమాని,కార్మికుల చర్చల ద్వారా రాజీకీ  రాలేకపోతే , రాజి అధికారి జోక్యం చేసుకొని మధ్యవర్తి గా వ్యవహరించి ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తొలగింప చేసి యజమాని కార్మికుల మధ్య విజయవంతంగా ఒక సమస్య పరిష్కారం కుదిర్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది
·         రాజీ అధికారి తన విధిగా పారిశ్రామిక వివాదం తలెత్తిన పక్షంలో ,సమ్మె నోటీసు ఇచ్చిన పక్షంలో, లాకౌట్ నోటీసు జారీ అయిన దశలో విధిగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది ,
·         రాజీ మండలి: రాజీ మండలి లో స్వతంత్రుడైన అధ్యక్షుడు ఇరు పక్షాల నుండి సమాన సంఖ్యలో ప్రతినిధులు ఇద్దరు లేదా నలుగురు ప్రతినిధులను ఆహ్వానిస్తారు
·         ఈ సమయంలో రాజీ అధికారి తన ముందు జరిగిన, రాజీ నివేదిక ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది ,ఇరుపక్షాల మధ్య పరిష్కారం కుదిరినది, లేనిది రాజీ ప్రయత్నాలు ప్రారంభించిన 14 రోజుల్లోగా ఆ నివేదికలో వెల్లడించాలి
·         రాజీ ప్రయత్నాలు రాజీ  కుదిరితే మెమోరాండం ఆఫీస్ సెటిల్మెంట్ పరిష్కార పత్రం రూపొందించాలి
·         దీని ఆధారంగా అందరు ని బద్దలు గా పనిచేయాల్సి ఉంటుంది
·         ఒకవేళ రాజీ కుదరడం లో ,పరిస్థితుల్లోనూ సాధ్యం కాని పక్షంలో రాజీ అధికారి సంబంధిత అధికారి కి వివరణ తో కూడిన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది
·         పారిశ్రామిక వివాదం వివరాలను, ఇరుపక్షాల అభిప్రాయాలను వారి మధ్య రాజీకి ప్రతిపాదించిన అంశాలను ,ప్రయత్నాలను ఆ నివేదికలో వివరించాలి
·         రాజీ కుదరని కారణాలను పరిస్థితులను చెప్పాల్సి ఉంటుంది
·         ప్రభుత్వం అవసరమనుకుంటే వివాదాన్ని రాజీ మండలికి గాని కార్మిక న్యాయస్థానానికి గాని ట్రిబ్యునల్స్ గాని పంపాలి
·         రాజు మండలి గాని, ట్రిబ్యునల్స్ గాని పరిష్కార పత్రాన్ని తయారు చేసి ఇరుపక్షాల సంతకాలు తీసుకుని రెండు నెలల లోపు గాని పొడిగించిన గడువు లోపు గాని ప్రభుత్వానికి పంపాలి
·         రాజీ ప్రయత్నాల ద్వారా పరిష్కారం కుదరకపోతే, ఇరుపక్షాలు అంగీకరించిన తేదీ నుంచి పరిష్కారం అమల్లోకి వస్తుంది   .రాజీ పత్రం మీద సంతకం చేసిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది ఇది ఇరుపక్షాలు నిర్ణయించిన దాన్ని బట్టి ఉంటుంది
·         పరిష్కారం కుదిరిన తేదీ నుంచి ఆరు నెలల పాటు ఒప్పందం అమలులోకి ఉంటుంది
·         రాజీ ఒప్పందాలు సమంజసమా ,కాదా అని పరిశీల పరిశీలించే అధికారం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కు  ఉంటుంది .  కానీ హైకోర్టుకు ఆ అధికారం లేదు
·         కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ, విచారణ కోర్టు ప్రభుత్వం పంపిన పరిశ్రామిక వివాదానికి సంబంధించిన ఏ అంశాన్నైనా విచారణకు కోర్టు పరిశీలించి పరిశోధన చేసి ప్రారంభమైన ఆరు నెలల్లో ప్రభుత్వానికి తన నివేదికను అందించాలి
·         మధ్యవర్తిత్వం:  పారిశ్రామిక వివాదాలు  న్యాయస్థానానికి లేదా ట్రిబ్యునల్ కు  లేదా జాతీయ ట్రిబ్యునల్స్ కు  యజమాని కానీ ,కార్మికులు గాని పంపివ్వమని యజమాని గాని  ,కార్మికులు గాని మధ్యవర్తులను ఉంచుకోవచ్చు
·         చర్చల ద్వారా రాజీ ప్రయత్నాలు పరిష్కారం కుదరకుండా ఉన్నప్పుడు కనీసం మధ్యవర్తిత్వం వివాదాన్ని మధ్యవర్తుల ముందు నుంచి అంగీకరించని పక్షంలో ప్రభుత్వం గాని ఇరుపక్షాలు విడిగా లేదా సమిష్టిగా సమర్పించిన దరఖాస్తు పైగానే ఆ వివాదాన్ని, లేబర్ కోర్టుకు లేదా పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్ కు పంపాలి
·         అంతర్గత విచారణ జరిపిన తర్వాత యాజమాన్యం సదుద్దేశంతో వ్యవహరించిద లేదా, అని మాత్రమే కాకుండా విచారణలో సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా విచారణ, తుది తీర్పును సమర్థవంతంగా ఉందో ,లేదో కూడా పరీక్షించే అధికారం ,కార్మిక వివాదాలు పరిశీలించే కోర్టుకుంటుంది
·         కార్మిక న్యాయస్థానం, ట్రిబ్యునల్స్ ,జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు లేదా అవార్డు సాధారణంగా ఏడాది పాటు అమలులో ఉంటుంది
·         లేబర్ కోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అప్పీలు ఉండదు
·         తీర్పులు అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు ఆ తరువాత సుప్రీం కోర్టుకి వెళ్ళవచ్చు
·         యాజమాన్యం లాక్ అవుట్ కు ముందు కార్మికులకు నోటీసు ఇవ్వాలి
·         కార్మికులు సమ్మెకు ముందు యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజులకు ముందుగానే ,ఆరు వారాల తర్వాత గానీ జరగడానికి వీలు లేదు నోటీసులో పేర్కొన్న తేదీ రోజు సమ్మె గాని, లేటు గా గాని జరపాలి
·         నోటీసులు తర్వాత 14 రోజుల కన్నా ముందే సమ్మె జరిగితే అది 14 రోజుల వరకు చట్టవిరుద్ధమైన సమ్మె అవుతుంది.
·         నోటీస్ ఇచ్చిన 5 రోజులలో నిర్ణీత పద్ధతిలో ,ప్రభుత్వానికి యాజమాన్యం ఆ విషయం తెలపాలి ,
·         రాజీ అధికారి ముందు పెండింగ్లో ఉన్న అంశం గురించి గానీ రాజీ విధానం ముగిసిన ఏడు రోజుల తర్వాత కానీ కార్మికులు సమ్మె చేయడం ,యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం విరుద్ధం
·         చట్టవిరుద్ధమైన సమ్మెలు ,లాకౌట్ జరిపితే వారికి ఎవరు ఆర్థిక సహాయం చేయకూడదు
·         ఆ సమయంలో వేతనాలు కోల్పోవడమే కాకుండా తొలగింపు వంటి శిక్షకు కూడా గురి కావాల్సి ఉంటుంది
·         అన్యాయంగా అక్రమంగా లాకౌట్ జరిగితే కార్మికులకు ఆ కాలంలో పూర్తి వేతనం చెల్లించవలసి ఉంటుంది
·         సమ్మె ముగిసిన తర్వాత మళ్లీ సమ్మె జరపమని కార్మికుల నుంచి వ్రాతపూర్వక అంగీకారాన్ని యజమాని కోరడానికి వీలులేదు
·         నిషేధాలు : రాజీ అధికారి ముందు రాజీ ఈ ప్రక్రియలో ఉండగా రాజీ ముగిసిన 7 రోజులు తర్వాత సమ్మె చేయడానికి వీలులేదు
·         బోర్డు ముందు రాజీ ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా లేదా ముగిసిన 7 రోజుల తర్వాత సమ్మెలు చేయడం నిషేధం
·         కార్మిక నా స్థానం లేదా ట్రిబ్యునల్  ముందు విచారణ జరుగుతుండగా లేదా ముగిసిన రెండు నెలల తర్వాత కూడా సమ్మెలో చేయడం నిషేధం
·         మధ్యవర్తి ముందు పరిష్కారం ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా లేదా ముగిసిన రెండు నెలల వరకు సమ్మె చేయడం నిషేధం  యజమాని లాకౌట్ చేయడం నిషేధం 
·         జరిమానాలు లేదా జైలు శిక్ష చట్టవిరుద్ధమైన సమ్మె ప్రారంభించిన ,కొనసాగించిన ఆ చర్యకు పాల్పడిన కార్మికుడికి నెల వరకు జైలు శిక్ష లేదా 50 రూపాయల దాకా జరిమానా విధించవచ్చు విధించవచ్చు
·         చట్టవిరుద్ధమైన లాక్ అవుట్ చేసిన కొనసాగించిన ఆ చర్యలకు పాల్పడిన యజమానికి నెల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు  జరిమానా లేదా రెండూ విధించవచ్చు
·         చట్టవిరుద్ధమైన సమ్మె ,లాక్ అవుట్ లో పాల్గొనాలని ప్రోత్సహించిన రెచ్చగొట్టిన ఆ వ్యక్తికి  ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు
·         లే ఆఫ్ ,(పని లేకుండా చేయడం ):
·         లే ఆఫ్ చేయడానికి 7 రోజుల ముందు నోటీసు ఫారం 1 కింద, లే ఆఫ్ ఉపసంహరించడానికి ఫారం- 12ను ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి
·         వంద మంది లేదా అంతకన్నా ఎక్కువ మంద కార్మికులు  పని పనిచేసేటటువంటి ఫ్యాక్టరీల లో ,గనులలో  ప్రభుత్వం ముందు అనుమతి తీసుకోకుండా  లేఆఫ్స్ చేయడానికి వీలులేదు
·         కొన్ని కాలాలలో మాత్రమే పని చేసే సంస్థలకు ఈ నియమం వర్తించదు
·         విద్యుత్తు కొరత వల్ల ,ప్రకృతి వైపరీత్యం వల్ల గాని ,గనులలో అయితే  అగ్నిప్రమాదం వలన వరదల వల్ల ప్రమాధం జరిగినప్పుడు ముందు అనుమతి తీసుకొ నే  అవసరం లేదు
·         గనులలో అగ్ని ,వరద  గ్యాస్ పేలుళ్ల వల్ల కార్మికులు లే ఆఫ్ చేయాల్సి వస్తే లే ఆఫ్ చేసిన తేదీ నుంచి 30 రోజుల లోగా కొనసాగించేందుకు అనుమతి తీసుకోవాలి
·         లే ఆఫ్ దరఖాస్తు ఫారం 3ను సమర్పించి లే ఆఫ్ అనుమతి కోరవచ్చు దీని ప్రతిని ప్రతి కార్మికునికి ఇవ్వాల్సి ఉంటుంది
·         కార్మికుడికి హాజరైన రెండు గంటలలో పని ఇవ్వలేకపోతే ఆ రోజు వరకు లే ఆఫ్ చేసినట్టు అవుతుంది
·         మొదటి షిఫ్టుల్లో పని ఇవ్వకుండా రెండో షిఫ్ట్ కి కార్మికుడిని పిలిస్తే సగం రోజులు అయినట్టు లెక్కించడం జరుగును
·         యజమాని నిర్వహించవలసిన బాధ్యత ;
·         కార్మికుల హాజరు పట్టీని నిర్వహించాలి
·         సమంజసమైన పని  మాత్రమే ఉండాలి
·         పని నిరాకరించిన తర్వాత రెండు గంటల కన్నా మించి పని వారిని నిర్బంధించకూడదు
·         యజమాని నిరవధికంగా పని  ఉన్నప్పుడు ఎప్పటి వరకు తెలియనప్పుడు పని ప్రారంభించిన మూడు వారాల్లోగా పని లో చేరమని యజమాని కార్మికుడికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది
·         కార్మికుడిని నిర్బంధ సమయం గంటకు మించి కార్మికులకు నిర్బంధించిన గడువుకు  ఇవ్వవలసిన మొత్తం జీతం ఇవ్వాలి 
·         ఒకవేళ కార్మికుడికి 12 నెలలకు మించి లే ఆఫ్ చేస్తే అతనికి వారాంతపు సెలవులు తప్ప మిగిలిన కాలానికి ఇవ్వవలసిన వేతనం జీతం లో 50% నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది
·         కార్మికుడు గడిచిన 12 నెలల కాలంలో, కనీసం 240 రోజులు  గనులలో అయితే 190 రోజు వాస్తవంగా పని చేస్తే ఆ కార్మికుడు సంవత్సరాలలో కంటిన్యూ గా పని చేసినట్లు అవుతుంది
·         నియామక ఒప్పందంలో భాగంగా పేర్కొని ఉంటే , నెలలలో 45 రోజులకు మించి లే ఆఫ్ జరిగినప్పుడు మొదటి 45 రోజులు కాలానికి నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు మిగిలిన కాలానికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది
·         పారిశ్రామిక సంస్థలు కార్మికుల సమ్మె చేయడం జరిగినప్పుడు గోస్లో నిదానంగా పని లేదా లే ఆఫ్ జరిగితే కూడా నష్ట పరిహారం చెల్లించే పని లేదు
·         కనీసం ఏడాది కాలం పరిశ్రమలో కొనసాగుతున్న కార్మికుడికి రిట్రెంచ్మెంట్ కింద నష్టపరిహారం అందించాల్సి ఉంటుంది
·         యాజమాన్యం బదిలీ సంస్థ పాక్షికంగా కాకుండా, సంపూర్ణంగా చేతులు మారటం వల్ల రిట్రెంచ్మెంట్ జరిగితే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది
·         మూసివేత : ఉద్యోగ సంస్థ పూర్తిగా గాని, శాశ్వతంగా గాని మూతబడితే దానిని మూసివేత అని పారిశ్రామిక వివాదాల చట్టం నిర్వహించింది
·         మూసివేత అనేది తుది నిర్ణయం ,తిరిగి మార్చలేనిది ,శాశ్వతమైనది కానీ లాకౌట్ మాత్రం కొంత కాలానికి పరిమితమైనది
·         వరుసగా నష్టాలు రావడం ,వ్యాపారంలో మళ్లీ నిలబెట్టుకుంటామని నమ్మకం లేకపోవడం తో పరిశ్రమలు మూతపడ వచ్చును
·         పరిశ్రమలోని ఒక విభాగాన్ని గాని ,శాఖను గాని, కొంత భాగాన్ని మూసివేసిన దశలవారీగా ముగిసిన మూసివేసే అవుతుంది
·         50 నుంచి 100 వరకు కార్మికులను కలిగిన ఫ్యాక్టరీ ముందు 12 నెలల పాటు నడిచిన పరిశ్రమ సంస్థ యజమాని మూసి వేయ దలచుకుంటే  ఫారం -q  ద్వారా ప్రభుత్వానికి మూసివే దలచిన కారణాలను వివరిస్తూ 60 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి
·         100 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థను మూసివేయాలంటే ఫారం- qA  లో 90 రోజుల ముందు దరఖాస్తు సమర్పించాల్సిన ఉంటుంది ఈ విధంగా నోటీసు ఇవ్వకపోతే మూసివేత చట్ట విరుద్ధం అవుతుంది
·         60 రోజుల్లోగా పరిశ్రమ యాజమాన్యానికి ఏ విధమైన సమాచారం పంపకపోతే 60 రోజుల తర్వాత అనుమతి ఇచ్చినట్టు భావించవచ్చు
·         మూసివేత నిర్ణయానికి 12 నెలల ముందు సగటున రోజుకు 50 మంది కార్మికులను నియమించిన పరిశ్రమను మూసివేయాలని నిర్ణయిస్తే ఏడాది పాటు వరుసగా సర్వీసులో ఉన్న కార్మికుడికి యజమాని కనీసం నెల రోజుల నోటీసిస్తే మూసివేత కారణాలను ఉద్దేశాలను తెలిసి నోటీసు కాలానికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది
·         కార్మికుడికి రిట్రెంచ్మెంట్  చేయవలసిన అవసరం ఏమిటో వివరిస్తూ మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాలి లేదా నోటీసు బదులు మూడు నెలల జీతం ఇవ్వాలి
·         ప్రకారం నిర్ణీత తేదీకి సర్వీస్ రిట్రెంచ్మెంట్  చేయడం జరిగితే నోటీసు అవసరం లేదు




ముఖ్యమైన సెక్షన్లు
·         సెక్షన్-2( జె ) ; ప్రకారం పరిశ్రమ అంటే వ్యాపారం వాణిజ్యం ,అండర్ టేకింగ్ ఉత్పత్తిదారులు ఉద్యోగులున్న సంస్థ
·         సెక్షన్ 2(s); ప్రకారం ఆర్మీ ఆక్ట్ ,నావి ఆక్ట్ ,వచ్చే ఉద్యోగులు ,పోలీసు సర్వీసు లేదా సేవల ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టం కిందికి రావు ,తొలగింపు, బర్తరఫ్, రిట్రెంచ్మెంట్ వివాదానికి దారితీసిన అప్పుడు ఆ వివాదానికి సంబంధించినంతవరకు కార్మికులు
·         సెక్షన్-2( ఏ); ప్రకారం వ్యక్తిగత వివాదాలు కార్మిక వివాదాలుగా పరిగణించబడవు
·         సెక్షన్-2 (1 ) ప్రకారం లాకౌట్ అంటే ఉద్యోగులు పనిచేసే సంస్థ తాత్కాలికంగా పనిని నిలిపివేయడం యజమాని కార్మికులను పనిలో కొనసాగించడానికి నిరాకరించడం
·         సెక్షన్-2 (ఏ); ప్రకారం పాక్షికంగా పని నిలిపివేయడం, దీక్ష చేయడం ,ధర్నా చేయడం కూడా సమ్మె కిందికి వస్తాయి
·         సెక్షన్ 2,(O): ప్రకారం సుదీర్ఘ అనారోగ్య కారణంగా  కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించడం రిట్రెంచ్మెంట్  కాదు
·         సెక్షన్-2( పి); ప్రకారం రాజీ అధికారి చేసిన సెటిల్మెంట్ కూడా రాజీ నే
·         సెక్షన్ 18( 3); ప్రకారం రాజీ ఈ విధానంలో కుదిరిన అంగీకారం ఇరుపక్షాలు విధిగా అనుసరించాలి
·         సెక్షన్ 18(1) ; ప్రకారం రాజీ ఒప్పందానికి న్యాయబద్ధత లభిస్తే ఒప్పందానికి నిబద్ధుడు కావాల్సి ఉంటుంది
·         సెక్షన్ 1( 4); ప్రకారం పారిశ్రామిక వివాదానికి సంబంధించిన ఏ అంశాన్నైనా కోర్టు విచారణ చేపట్టి ఆరు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదికను అందించాల్సి ఉంటుంది
·         సెక్షన్ 18 ,19; ప్రకారం కార్మిక న్యాయస్థానం ట్రిబ్యునల్, జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఏడాది పాటు అమలులో ఉంటాయి
·         సెక్షన్ 2( 9)  ;ప్రకారం సమ్మె అంటే కొందరు కార్మికులు ఉమ్మడిగా పనిని నిలిపివేయడం
·         సెక్షన్ 22; ప్రకారం రాజీ విధానం ముగిసిన 7 రోజుల తర్వాత గానీ, కార్మికులు సమ్మె చేయడం యజమాన్యం లాకౌట్ చేయడం చేయకూడదు
·         సత్యం 25; ప్రకారం చట్టవిరుద్ధమైన సమ్మె లేదా లాక్ అవుట్ కు ఆర్థిక సహాయం చేయకూడదు
·         సెక్షన్-2 (KK); కార్మికుడికి  లేఆఫ్ ( పని లేకుండా) చేయడం.
·         సెక్షన్ -25 ; ప్రకారం పారిశ్రామిక సంస్థ లో కార్మికులు సమ్మె చేయడం గో స్లో (నిదానంగా పని ) ఆందోళన వల్ల జరిగితే కూడా నష్ట పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు
·         సెక్షన్ -25( C); ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికుడిని యజమాని  లేదా  లే ఆఫ్ చేయడం ఆరు నెలల వరకు  జైలుశిక్ష  లేదా వెయ్యి రూపాయలు జరిమానా
·         సెక్షన్ 25 ;(R 1) ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా పరిశ్రమను మూసివేయడం చేస్తే ఆరు నెలల వరకు జైలుశిక్ష ఐదు వేల వరకు జరిమానా
·         సెక్షన్ 26 (;1 ) :ప్రకారం చట్ట వ్యతిరేక సమ్మెలో కార్మికుడు పాల్గొనడం ,చర్యలు తీసుకోవడం చేస్తే నెల వరకు జైలు లేదా 50 రూపాయల వరకు జరిమానా విధించబడును
·         సెక్షన్ 26 (2)  ;ప్రకారం చట్ట వ్యతిరేకంగా యజమాని లాకౌట్ ప్రకటించడం, కొనసాగించడం చేస్తే నెల వరకు జైలు లేదా వెయ్యి రూపాయల వరకు జరిమానా అవసరమైతే రెండు విధించబడును
·         సెక్షన్ 31 (2);రెండు ప్రకారం ఈ చట్ట నియమ నిబంధనలు ఉల్లంఘించిన వంద రూపాయల వరకు జరిమానా విధించబడును


Comments

Popular posts from this blog

గ్రాట్యూటీ చెల్లింపు చట్టం 1972

·        గ్రాట్యూటీ చెల్లింపు చట్టం 1972 ·          1972 కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగింది ·          సంస్థ కు సేవలందించి ఆర్థిక ప్రగతి కి కృషిచేసిన కార్మికునికి , యాజమాన్యం ఇచ్చే ప్రతిఫలమే గ్రాట్యూటీ ·          కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక వెసులుబాటును కల్పించడం కోసం   గ్రాట్యూటీ చెల్లింపు చట్టం తీసుకురావడం అయినది ·            పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఏడాదికి పైగా పనిచేస్తూ ఉన్నచోట , ఈ చట్టం కింద గ్రాట్యూటీ చెల్లించవలసి ఉంటుంది తర్వాత ఉద్యోగుల సంఖ్య పదికి తగ్గిన ఈ చట్టం వర్తిస్తుంది ·          1995 సంవత్సరాల నుంచి సిక్కిం రాష్ట్రానికి కూడా గ్రాట్యూటీ చెల్లింపు చట్టం వర్తింపజేస్తున్నారు ·            పూర్వాపరాలు; ·            మొదట్లో ఈ చట్టం కింద వెయ్యి రూపాయల జీతం తీసుకునే వారికి ఈ చట్టం వర్తించేది ·          1992 సవరణ ప్రకారం 3500 కంటే తక్కువ జీతం తీసుకునే వారికి ఈ చట్టం వర్తింపజేశారు మరియు గ్రాట్యూటీ సొమ్మును 60000 మించకుండా ఉండేవిధంగా నిర్ణయించార

ప్రసూతి ప్రయోజన చట్టం -1961 (MATERNITY BENEFIT ACT)

ప్రసూతి ప్రయోజన చట్టం -1961 (MATERNITY BENEFIT ACT) ·          మహిళలకు కాన్పు సమయంలో   విధులకు సంబంధించి కాన్పుకు ముందు మరియు తర్వాత    ప్రత్యేక ప్రయోజనాలను కల్పించేందుకు 1 961 లో ప్రయోజనాల చట్టాన్ని రూపొందించడం జరిగింది   దీనిని మాతృత్వ సంక్షేమ చట్టం అని కూడా అంటారు ·          దేశమంతటా అన్ని ఫ్యాక్టరీలకు ఈ చట్టం వర్తిస్తుంది ·          పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఫ్యాక్టరీలు అన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది ·          కొన్ని రాష్ట్రాలు ప్రసూతి ప్రయోజన చట్టం వెసులుబాటు తో పాటు ఉచిత చికిత్స ప్రసూతి బోనస్ బాలల లాలన కేంద్రాలు లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ·          స్థానిక భీమా చట్టం లాంటి నియమాలు వర్తించే సంస్థలకు ఈ చట్టం వర్తించదు ·          ఈ చట్టం ప్రకారం మహిళా అంటే సంస్థలో వేతనాలు తీసుకొని ఉద్యోగం చేసేందుకు యాజమాన్యం నేరుగా లేదా కాంట్రాక్టు ద్వారా నియమించబడిన మహిళా అని అర్థం ·          ప్రసూతి ప్రయోజనాల చట్టానికి అర్హత పొందాలంటే గడిచిన 12 నెలల లో కనీసం 80 రోజులు మహిళా సంస్థలో పని చేసి ఉండా లి ·          ఈ సెలవుల్లో లెక్కింపులో  హాలిడ